దానికి నో బ్రేక్: అలియా

- Advertisement -
Alia weds Ranbir Kapoor


అలియా భట్ పెళ్లి చేసుకొంది. తన ప్రియుడు, బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ తో ఆమె పెళ్లి ఘనంగా జరిగింది. అంతకుముందు ఒప్పుకున్న హిందీ సినిమాల షూటింగులు అన్ని పూర్తి చేసిన తర్వాతే పెళ్లి చేసుకొంది. ఐతే, ఆమె సినిమా కెరీర్ కి కామా కానీ, ఫుల్ స్టాప్ కానీ పెట్టడం లేదు.

“సినిమా కెరీర్ కొనసాగుతుంది. సినిమాలు ఆపాలన్న ఆలోచన నాకు లేదు. రణబీర్ కి అస్సలు రాదు,” అని అలియా భట్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. ఇటీవలే తన గురువు కరణ్ జోహార్ దర్శకత్వంలో ఒక లవ్ స్టోరీ సైన్ చేసింది. అలాగే, ఒక హాలీవుడ్ చిత్రం కూడా ఒప్పుకొంది.

హిందీలో మరిన్ని సినిమాలు కూడా సైన్ చేయనుంది.

రణబీర్ కపూర్ సోదరి (పెద్దనాన్న కూతురు) కరీనా కపూర్ కూడా పెళ్లి తర్వాత హీరోయిన్ గా సినిమా కెరీర్ కంటిన్యూ చేసింది. అలియా భట్ కిప్పుడు 30 ఏళ్ళు. సో, ఆమె కెరీర్ కి ఢోకా లేదు మరికొన్నేళ్లు.

More

Related Stories