వామ్మో ఆలియా వ్యాల్యూ ఇంతా!

Alia Bhat

దేశంలో ప్రస్తుతం నెంబర్ హీరోయిన్… ఆలియా భట్. పారితోషికం పరంగా దీపిక పదుకోన్ ది పైచేయి. కానీ విజయాల పరంగా, స్టార్డం పరంగా ఆలియా భట్ అగ్రస్థానంలో ఉంది. ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా అందుకొంది. కార్పొరేట్ బ్రాండ్స్ కూడా ఆలియా చేతిలోనే ఎక్కువ.

అందుకే, సంపాదన పరంగా, బ్రాండ్ వాల్యూ పరంగా అలియా భట్ దూసుకుపోతోంది.

మూడేళ్ళ క్రితం ఆమె వ్యాల్యూ  560 కోట్ల రూపాయలు ఉండేదట. ఇప్పుడు అది 900 కోట్లకు ఎగబాకింది. దీన్ని బట్టి చెప్పొచ్చు ఆమె స్థాయి ఏంటో, క్రేజ్ ఏంటో.

అంటే ఆమె బ్రాండ్ వాల్యూ మూడేళ్ళలో దాదాపు డబుల్ అయింది. గత మూడేళ్లలో ఆమె నటించిన సినిమాలు ఇవే: గంగూబాయి, ఆర్ ఆర్ ఆర్, బ్రహ్మాస్త్ర, రాకీ ఔర్ రాణి ప్రేమ్ కి కహాని. అన్నీ హిట్స్. ఇవి కాకుండా ఒక హాలీవుడ్ చిత్రంలో గెస్ట్ రోల్ చేసింది. నిర్మాతగా సినిమాలు నిర్మించింది. చేతిలో అనేక బ్రాండ్స్. అందుకే, ఆమె పేరుకి ఎంత వ్యాల్యూ ఉంది అనే లెక్క కడితే అది ప్రస్తుతం 900 కోట్ల విలువ చేస్తుంది అని ఒక సంస్థ పేర్కొంది.

బ్రాండ్ వ్యాల్యూ అంటే ఒక వ్యక్తి లేదా బ్రాండ్ కి ఉన్న మొత్తం విలువ. ఆ విధంగా ఆలియా భట్ ఇండియాలో నెంబర్ వన్ హీరోయిన్ అనే చెప్పాలి.

Advertisement
 

More

Related Stories