అనుపమ గ్లామర్ పై టిల్లు ఫోకస్!

Tillu Square

“డీజే టిల్లు” సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయింది నేహా శెట్టి. ఆ సినిమాలో ఆమె అందం, ఆమె సెక్సాప్పీల్ కుర్రకారుని బాగా ఆకట్టుకున్నాయి. “రాధిక” అనే క్యారెక్టర్ లో ఆమె అదరగొట్టింది. ఐతే, ఆ సినిమా సక్సెస్ కావడానికి ప్రధాన కారణం అందులోని ఎంటర్ టైన్ మెంట్. అలాగే సిద్దూ జొన్నలగడ్డ డైలాగ్స్, అతని నటన.

ఇప్పుడు దానికి సీక్వెల్ వస్తోంది. ఈ సీక్వెల్ పేరు … టిల్లు స్క్వేర్. ఈ సీక్వెల్ లో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకి కొత్త విడుదల తేదీ కన్ఫర్మ్ అయింది.

ఐతే, ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన అన్ని పోస్టర్స్ లలో అనుపమ గ్లామర్ హైలెట్ అయింది. అనుపమ పరమేశ్వరన్ కాస్త బోల్డ్ గా నటించినట్టు ఈ స్టిల్స్ చెప్తున్నాయి. ఆమె గ్లామర్ షో ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ అయ్యేట్లు ఉంది.

“టిల్లు స్క్వేర్”పై భారీ అంచనాలు ఉన్నాయి. యూత్ ఎగబడి చూస్తారు. ఓపెనింగ్ మామూలుగా ఉండదు. అందుకే, ఆ అంచనాలకు తగ్గట్లు ఈ సినిమాలో వినోదం, గ్లామర్… రెండూ డబుల్ డోస్ లో ఉంటాయట. ఈ పోస్టర్స్ తో ఆ హింట్ ఇస్తున్నారు మేకర్స్. అనుపమ కూడా ఈ మధ్య బోల్డ్ గా ఫోటోషూట్ లు చేస్తోంది. తన ఇన్ స్టాగ్రామ్ నిండా అలాంటి అందాల ఆరబోతే. మొత్తానికి “టిల్లు స్క్వేర్”లో అనుపమ గ్లామర్ ఫుల్లుగా ఫోకస్ లోకి వస్తుందన్నమాట

Tillu Square

మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. మార్చి 29న విడుదల కానుంది ఈ టిల్లు స్క్వేర్.

Advertisement
 

More

Related Stories