ఐటెంగాళ్ గా అప్సర బిజీ

హీరోయిన్ గా అడుగుపెట్టింది. సక్సెస్ కాలేదు. రామ్ గోపాల్ వర్మ ఫోకస్ లోకి వచ్చింది. అంతే ఇతర దర్శకుల దృష్టిలో పడింది. ఇప్పుడు ఐటెం గాళ్ గా బిజీ. ఆమె పేరు అప్సర రాణి.

ఆమె అసలు పేరు అంకిత మహారణా (Anketa Maharana). ఉత్తరాంచల్ లో పుట్టిన ఒడియా సుందరి. మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. రామ్ గోపాల్ వర్మ ఆమె ని ‘డేంజరస్’ అనే సినిమాలో లెస్బియన్ గా చూపించాడు. ఆ టీజర్, ఆ సినిమా ఫోటోలు రాగానే ఆమెకి సెక్సీ భామగా గుర్తింపు దక్కింది. అంతే ఆమెని ఐటెం గాళ్ గా పరిచయం చేశారు ‘క్రాక్’ సినిమాలో. ‘భూమ్ బద్దలు’ అనే ఆ పాట హిట్టయింది.

ఆ తర్వాత ‘సీటిమార్’ చిత్రంలో ‘పెప్సీ ఆంటీ’గా ఆడింది. ‘డీ కంపెనీ’ అనే సినిమాలో కూడా ఐటెం గాళ్ గా దర్శనమిచ్చింది. ఇలా మూడు సినిమాల్లో ఐటెం భామగా అలరించిన ఈ భామకి తాజాగా సుధీర్ బాబు సినిమాలో కూడా అదే పని చేసే అవకాశం దక్కింది.

సుధీర్ బాబు హీరోగా ‘హంట్’ అనే థ్రిల్లర్ రూపొందుతోంది. ఈ సినిమాలో ‘పాపతో పైలం’ అనే ఐటెం సాంగ్ చేసింది. మొత్తమ్మీద అప్సర కాస్త ఐటెంసుందరి అయిపోయింది.

 

More

Related Stories