విలన్ గా నటిస్తే వందకోట్లు!

విలన్ గా నటిస్తే వందకోట్లు!
హీరోగా సత్యదేవ్ ఇప్పటికే పలు సినిమాల్లో నటించాడు. ఇంకా కొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి టైంలో చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో విలన్ గా నటించి మెప్పించాడు. హీరోగా మారకముందు విలన్ పాత్రలు పోషించడం వేరు, హీరోగా విజయం సాధించాక చెయ్యడం వేరు. ఐతే, చిరంజీవి సినిమా కావడంతో సత్యదేవ్ ఒప్పుకున్నాడు.

ఇలాగే విలన్ గా నటిస్తే ఈజీగా వంద కోట్లు సంపాదిస్తావు అని అతనికి ఇప్పుడు సలహా ఇస్తున్నారట.

“గాడ్ ఫాదర్ కెమెరామేన్ నిరవ్ షా నాకు ఒక సలహా ఇచ్చారు. నువ్వు ఇలాగే విలన్ పాత్రలు పోషించు. బిజీ అయిపోతావు. 100 కోట్లు వెనకేసుకుంటావు అన్నారు ఆయన,” అని గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో సత్యదేవ్ వెల్లడించాడు.

మలయాళం ‘లూసిఫర్’ సినిమాకి ఇది రీమేక్. మలయాళంలో వివేక్ ఒబెరాయ్ ఆ పాత్ర పోషించాడు.

 

More

Related Stories