
47 ఏళ్ల మలైక కోసం 35 ఏళ్ల ఆమె ప్రియుడు అర్జున్ కపూర్ 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అపార్ట్మెంట్ కొన్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ముంబైలో ఉంటున్న ఇంటికి దగ్గర్లోనే అర్జున్ కపూర్ 20 కోట్ల రూపాయలు ఖర్చుతో ఫ్లాట్ కొనుక్కున్నాడు. త్వరలోనే వీరిద్దరూ ఈ ఇంట్లోకి మూవ్ అవుతారట.
ఈ ఏడాది వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరిగింది. కానీ ఆ ప్లాన్ వాయిదా పడిందట. మలైకకి ఒక కొడుకు ఉన్నాడు. భర్త నుంచి రెండేళ్ల క్రితం విడాకులు తీసుకొంది.
బాలీవుడ్ లో హీరోలకు, హీరోయిన్లకు పెద్దగా సక్సెస్ రేట్ లేకున్నా పారితోషికాలు గట్టిగానే ముడుతాయి. అందుకే, చాలామంది హీరోయిన్లు అన్ని కోట్లు పెట్టి ఫ్లాట్ కొంటారు.

ఇంకో మూడేళ్లు గడిస్తే మలైక 50లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ టైంలో ఆమె రెండో సారి మూడు ముళ్లు వేయించాలనుకోవడం విశేషం.