
‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన అవికా గోర్ ఆ తర్వాత మరో రెండు, మూడు హిట్ చిత్రాల్లో నటించింది. కానీ, ఆ తర్వాత ఆమెకి అవకాశాలు తగ్గిపోయాయి. సక్సెస్ లేకుండా పోయింది. ఈ భామ ఇప్పుడు తెలుగు హీరోలపై విమర్శలు ఎక్కుపెట్టింది. తెలుగులో 80 శాతం హీరోలు స్టార్ కిడ్స్ అని అంటోంది.
“బాలీవుడ్ లో నెపోటిజం ఎక్కువ అనే భ్రమ ఉంది. కానీ నిజానికి తెలుగు, తమిళ సినిమా రంగాల్లోని ఇది ఎక్కువ. దాదాపుగా ఇప్పుడు ఉన్న ప్రతి పెద్ద హీరో, యువ హీరో ఒకప్పటి నటులకు కొడుకో, అల్లుడో, చుట్టమో. హీరోల కొడుకులే కాదు నిర్మాతల, దర్శకుల కొడుకులు కూడా హీరోలుగా ఉన్నారు ఇక్కడ,” అని ఆమె కుండబద్దలు కొట్టింది.
“లక్ష్మి రావే మా ఇంటికి”, “సినిమా చూపిస్తా మావ”, “రాజుగారి గది 3” వంటి సినిమాల్లో నటించిన అవికా గోర్ ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ఆమె నటించిన హిందీ చిత్రం “1920 Horrors Of The Heart” ఈ నెల 23న విడుదల కానుంది.
తెలుగులో ఇప్పుడు పెద్దగా అవకాశాలు ఏమి లేవని ఆమె గ్రహించింది. అందుకే, ఇంత నిర్మొహమాటంగా మాట్లాడింది ఈ భామ.