ప్రచారం… ఒకటి కాగానే ఇంకోటి

జాన్వీ కపూర్ సినిమాలు ఆడుతున్నాయా లేదా అన్నది పక్కన పెడితే ఆమె మాత్రం తన సినిమాలకు అద్భుతంగా ప్రచారం చేస్తుంది. ఒక నెల రోజుల పాటు “పరమ్ సుందరి” ప్రమోషన్స్ చేసింది. ఇప్పుడు టొరంటో వెళ్ళింది మరో సినిమా ప్రచారం కోసం.
ఆమె ఇప్పటికే “హోంబౌండ్” అనే సినిమా కోసం కాన్స్ ఫిలిం ఫెస్టివల్ వెళ్లి అక్కడ ప్రచారం చేసింది. అదే చిత్రం కోసం ఇప్పుడు టొరొంటో వెళ్ళింది. టొరంటో ఫిలిం ఫెస్టివల్. (TIFF)లో జోరుగా ఇంటర్వ్యూలు ఇస్తూ, రెడ్ కార్పెట్ దర్శనం ఇస్తూ ఆ సినిమాకి ప్రాచుర్యం కల్పిస్తోంది.
నిజానికి ఇది మెయిన్ స్ట్రీమ్ సినిమా కాదు. ఆర్ట్ ఫిలిం లాంటిది. అయినా ఈ సినిమా కోసం కూడా తెగ ప్రమోషన్ చేస్తోంది.
ALSO CHECK PHOTOS: TIFF spotlight: Janhvi Kapoor stuns in style
ఇది అయిపోగానే ఆమె వెంటనే “సన్నీ సంస్కారికి తులసి కుమారి” (Sunny Sanskari Ki Tulsi Kumari) చిత్రం ప్రమోట్ చెయ్యాలి. ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. సో, ఈ నెల అంతా ఆ పనిలోనే ఉంటుంది. ఒక సినిమా ఒప్పుకుంటే ఆ సినిమాకి కావాల్సిన అన్ని బాధ్యతలు పక్కాగా నెరవేరుస్తోంది ఈ భామ.

ఇక వచ్చే ఏడాది ఆమె ‘పెద్ది’తో మళ్ళీ హడావిడి చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇందులో రామ్ చరణ్ కి ప్రేమికురాలిగా నటిస్తోంది ఈ భామ.