చిరంజీవికీ తప్పని ఎక్సట్రాలు!

Godfather


మెగాస్టార్ చిరంజీవి కూడా న్యూమరాలజీ సెంటిమెంట్ లు పట్టించుకున్నట్లు కనిపిస్తోంది. ఇన్నాళ్లూ ఆయన తన పేరుని CHIRANJEEVIగానే రాసుకున్నారు. ఇప్పుడు దానికి ఒక మరో ‘ఈ’ తగిలించారు. CHIRANJEEEVIగా మారింది ఆయన పేరు. డబుల్ ఈ స్థానంలో త్రిబుల్ ఈ వచ్చింది.

బాలీవుడ్ లో ఈ పద్దతి ఎక్కువ, కరణ్ జోహార్ తన సినిమాల టైటిల్ స్పెల్లింగ్ లు ఇలా న్యూమరాలజీ ప్రకారం మారుస్తుండేవాడు. ఆ తర్వాత కరీనా సహా పలువురు హీరోయిన్లు, హీరోలు తమ పేర్ల స్పెల్లింగ్ లు మార్చుకున్నారు అదృష్టం మారుతుందని. తెలుగులో నితిన్ తన పేరులో డబుల్ ఐ తగిలించుకున్నాడు.

కానీ హీరోగా ఉన్నత శిఖరాలు అధిరోహించిన చిరంజీవి ఈ వయసులో ఇలా న్యూమరాలజీ ప్రకారం ఎక్స్ట్రా ఈ తగిలించుకోవడం కొంచెం అతిగానే ఉంది.

ఆయన నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ సినిమా పోస్టర్లో ఇలా ఎక్స్ట్రాలు కనిపించాయి. ‘ఆచార్య’ దారుణంగా పరాజయం పాలు కావడంతో ఆయన ఇలా లక్ కోసం మార్చారా? లేక మేకర్స్ స్వంతంగా నిర్ణయం తీసుకున్నారా అనేది చూడాలి.

 

More

Related Stories