సాయం తీసుకున్నారు… హ్యాండిచ్చారు!

Chiranjeevi


మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య కాలంలో ఎన్నో దానాలు చేశారు. కష్టాల్లో ఉన్నామని సాయం అడిగిన ప్రతి నటుడికి, సాంకేతిక నిపుణిడికి ఆర్థికంగా ఆదుకున్నారు మెగాసార్. అలాగే, లాక్డౌన్ కాలంలో కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు ఆలోచన చిరంజీవిదే. సినిమా ఇండస్ట్రీలోని పెద్దలు, స్టార్ హీరోలు డబ్బులు సమకూర్చారు ఆ నిధికి. కానీ, ఆలోచన, నిర్వహణ అంతా మెగాస్టార్ దే.

తన వ్యక్తిగత హోదాలో కూడా చిరంజీవి కరోనా టైంలో సినిమా ఇండస్ట్రీలో ఎంతో మందికి హెల్ప్ చేశారు.

ఐతే, “మా” ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి మద్దతు ఇచ్చిన ప్రకాష్ రాజ్ ని ఓడించారు. సాయం తీసుకున్న వారు కూడా చిరంజీవి వైపు పెద్దగా నిల్చున్నట్లు లేదు. చిరంజీవి స్వయంగా బయటికి వచ్చి తాను ప్రకాష్ రాజ్ ని నిలబెట్టాను అని కానీ, చిరంజీవి తరఫున ప్రకటన కానీ రాలేదు. నాగబాబు మాత్రం చెప్పారు. సో… ఈ మొత్తం ఎన్నికల్లో మా సభ్యులు చిరంజీవి స్థాయిని తగ్గించారు. దాసరి తర్వాత ఇండస్ట్రీ పెద్దగా మెగాస్టార్ వ్యహరిస్తున్నారు.

కానీ, “మా” సభ్యులు మాత్రం ఆయనకి ఆ గౌరవం ఇవ్వలేదనిపిస్తోంది.

 

More

Related Stories