- Advertisement -

బండారు దానయ్య కవి దర్శకత్వంలో పుప్పాల శ్రీధర్ రావు నిర్మిస్తున్న చిత్రం… “చిత్రపటం”. నెలాఖరుకు విడుదలకు సిద్ధమవుతోంది. ఇది ఒక ఎమోషల్ ఎంటర్ టైనర్ అని అంటున్నారు మేకర్స్.
“మనుషుల ఆప్యాయత, అనురాగాలను, వారి భావోద్వేగాలను ప్రతిబింబిస్తూ రూపొందించిన చిత్రమిది. కోట శ్రీనివాసరావు వంటి సీనియర్ ఆర్టిస్టులు ఈ చిత్రంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రేక్షకులకు ఇంకా చేరువ అవ్వాలనే ఉద్దేశంతో రేడియోమిర్చి వారి సహకారంతో చిత్రపటం పాటల కాంటెస్ట్ నిర్వహించి, విజేతలకు ఎలక్ట్రానిక్ బైక్ లను బహుమతి ప్రదానం చేయనున్నాం,” అన్నారు బండారు దానయ్య.