టైమ్ మేగజైన్ కవర్ పై దీపిక

TeluguCinema 11 May 2023
Deepika Padukone Time Magazine

దీపిక పదుకోన్ నిజమైన గ్లోబల్ స్టార్. ఆమె ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పాపులర్. ఇప్పుడు టైమ్ మేగజైన్ కూడా ఆమెని గౌరవించింది.

ప్రఖ్యాతిగాంచిన టైమ్ మేగజైన్ తన కొత్త ఎడిషన్ ముఖ చిత్రాన్ని దీపిక పదుకోన్ తో అలంకరించింది. ఆమెప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

“The Global Star: Deepika Padukone is bringing the world to Bollywood.” (ప్రపంచాన్ని బాలీవుడ్ ముంగిట్లోకి తెస్తున్న గ్లోబల్ స్టార్ దీపిక పదుకోన్) అంటూ ఆమె గురించి ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

ఆమె ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి, ఇండియన్ సినిమాల పాపులారిటీ గురించి, అలాగే ఆస్కార్ గెలుచుకున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రం గురించి కూడా మాట్లాడింది. “ఒక పాటకి అవార్డు రావడం, ఒక డాక్యుమెంటరీకి అవార్డుతోనే భారతీయ సినిమా సంతృప్తి పడకూడదు. ఇక ఇప్పటినుంచి ఆస్కార్ మెయిన్ అవార్డులు కూడా కొల్లగొట్టే పనిలో మొత్తం భారతీయ చిత్రసీమ ప్రయత్నించాలి. ఆర్ ఆర్ ఆర్ పాటకి అవార్డు రావడం ఒక మంచి పరిణామం. ఇది తొలి అడుగు మాత్రమే,” అని ఆమె పేర్కొంది.

దీపిక పదుకోన్ ఇటీవలే ‘పఠాన్’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక త్వరలో హృతిక్ రోషన్ సరసన ‘ఫైటర్’లో, ప్రభాస్ సరసన ‘ప్రాజెక్ట్ కె’లో దీపిక దర్శనమిస్తుంది.