దీపికతో స్పెషల్ సాంగ్

షారుక్ ఖాన్ – దీపిక పదుకోన్ కలిసి నటిస్తే సినిమా హిట్ అని ఒక సెంటిమెంట్ ఉంది. వీరి కాంబినేషన్ లో రీసెంట్ గా వచ్చిన ‘పఠాన్’ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షారుక్ ఖాన్ ని మళ్ళీ హిట్ ట్రాక్ లోకి తెచ్చింది ఈ మూవీ. ఇక షారుక్ నటిస్తున్న తాజా చిత్రం ‘జవాన్’లో కూడా దీపిక కనిపించనుంది.

తమిళ దర్శకుడు అట్లీ తీస్తున్న ‘జవాన్’లో షారుక్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా రెండు నెలల్లో విడుదల కానుంది. ఐతే, సినిమాకి మరింత హైప్ తెచ్చేందుకు దీపికతో స్పెషల్ సాంగ్ చేయించాలని నిర్ణయం తీసుకున్నారట.

అనిరుధ్ స్వరపర్చిన ప్రత్యేక గీతంలో షారుక్, దీపిక డ్యాన్స్ చేస్తారట. ఈ పాటని ఈ నెలలోనే చిత్రీకరించనున్నారు.

మరోవైపు, దీపిక నటిస్తున్న మొదటి తెలుగు చిత్రం “ప్రాజెక్ట్ కె”కి సంబంధించిన షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఈ సినిమా షూటింగ్ లో అమితాబ్ బచ్చన్ గాయపడ్డారు. అమితాబ్, దీపిక, ప్రభాస్ మధ్య ఇంకా కొన్ని సీన్లు తీయాల్సి ఉందట.

Advertisement
 

More

Related Stories