దేవీ అరంగేట్రం… అంతా సిద్ధం

TeluguCinema 18 Oct 2025
Devi Sri Prasad

సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ హీరో కావాలని గత 15 ఏళ్లుగా అనుకుంటున్నాడు. ఇన్నేళ్లకు అది నిజం అవుతోంది. ఎప్పుడో 30లో ఉన్నప్పుడు హీరో అవ్వాలని భావించాడు. ఇప్పుడు 47 ఏళ్ల వయసులో నటుడిగా అరంగేట్రానికి అంతా సిద్ధం అవుతోంది.

‘బలగం’ దర్శకుడు వేణు యెల్దండి తీస్తున్న కొత్త చిత్రం… ఎల్లమ్మ. ఈ సినిమాలో మొదట నానిని హీరోగా తీసుకోవాలని భావించారు. నాని మొదట ఒప్పుకున్నా ఆ తర్వాత తప్పుకున్నాడు. ఆ తర్వాత నితిన్ తో ప్లాన్ చేశారు. మధ్యలో బెల్లంకొండ శ్రీనివాస్ పేరు వినిపించింది. ఫైనల్ గా దేవీశ్రీ ప్రసాద్ వద్ద వచ్చి ఆగింది.

ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ ఈ పాత్ర కోసం కసరత్తులు చేస్తున్నాడట. కానీ ఈ సినిమా సెట్ మీదకు వెళ్లేంతవరకు డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే అంతమంది హీరోలు మారారు.

నిజానికి దిల్ రాజ్ దేవి శ్రీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చెయ్యాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. అంతకుముందు వివి వినాయక్ హీరోగా కూడా ఆయన ఒక సినిమా మొదలుపెట్టి ఆపేశారు. మరి ఇప్పుడు దేవిని హీరోగా పరిచయం చెయ్యాలనుకుంటున్న ప్రయత్నం సఫలీకృతం అవుతుందా?

TeluguCinema

View all posts

Recent News