ధనుష్ ఇంటి బడ్జెట్ 150 కోట్లు!

Dhanush

ధనుష్ సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నాడు. రజినీకాంత్ ఉండే పోయస్ గార్డెన్ ప్రాంతంలోనే భారీ భవంతి కడుతున్నాడు. ఈ ఇంటి బడ్జెట్ ఏకంగా 150 కోట్ల రూపాయలంట.

చెన్నైలోని పోయస్ గార్డెన్ ఏరియాలో ఉండేవారంతా రిచ్ అండ్ ఫేమస్సే. చెన్నైలోని అతి ఖరీదైన ప్రాంతమది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్కడే నివసించేవారు. కానీ ఆ ఏరియాలో ఎవరూ 150 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టలేదు. ధనుష్ అల్ట్రా మోడ్రన్ వసతులతో, కళ్ళు చెదిరే ఆర్కిటెక్చర్ తో కట్టిస్తున్నాడట. ధనుష్, ఆయన భార్య ఐశ్వర్య, వారి ఇద్దరు పిల్లలు ప్రస్తుతం చెన్నైలోని వేరే ప్రాంతంలో ఉంటున్నారు. వచ్చే ఏడాదిలో ఈ ఇల్లు పూర్తి కాగానే వెంటనే షిఫ్ట్ అయిపోవాలని టార్గెట్ పెట్టుకున్నారు. తండ్రికి దగ్గరిగా ఉండాలనేది ఐశ్వర్య కోరిక. అందుకే పోయెస్ గార్డెన్ లోనే ఇల్లు కట్టుకుంటున్నారు.

ధనుష్ ఈ ఇంటికి అవుతున్న ఖర్చు కోసమే తెలుగులో కూడా సినిమాలు ఒప్పుకుంటున్నట్లు టాక్. తెలుగులో ఇప్పటికే శేఖర్ కమ్ముల సినిమా సైన్ చేశాడు ధనుష్. ఈ సినిమాకి భారీమొత్తంలో పారితోషికం తీసుకోనున్నాడు. ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు.

ఐతే, సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించే మరో తెలుగు సినిమాని కూడా ధనుష్ ఒప్పుకున్నాడని ప్రచారం జరుగుతోంది. వెంకీ అట్లూరి అనే యువ దర్శకుడు తీసే మూవీ ఇది. వెంకీ అట్లూరి సినిమా నిజంగా ఒప్పుకుంటే… అది డబ్బుల కోసమే అని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే… శేఖర్ కమ్ములలా వెంకీ అట్లూరి పాపులర్ డైరెక్టర్ కాదు.

Advertisement
 

More

Related Stories