
ఈ మధ్య కొందరు జర్నలిస్టులు ప్రెస్ మీట్లలో వేస్తున్న ప్రశ్నలు హీరోయిన్లను ఇబ్బంది పెడుతున్నాయి. సభ్యతకి సంబంధించిన హద్దులు మీరిన ప్రశ్నలు ఎదుర్కుంటున్నారు హీరోయిన్లు. ప్రెస్ మీట్ వేదికపై ఏమి అనలేక ఆ తర్వాత తమ ఇన్ స్టాగ్రామ్ ద్వారా నిరసన తెలుపుతున్నారు.
ఇంతకుముందు నేహా శెట్టి, సమంత ఇలాగే చేశారు. ఇప్పుడు డింపుల్ హయతి వంతు.
డింపుల్ హయతి ‘గద్దలకొండ గణేష్’, ‘ఖిలాడీ’ వంటి సినిమాల్లో నటించింది. తాజాగా గోపీచంద్ సరసన ‘రామబాణం’లో హీరోయిన్ గా కనిపిస్తోంది. ఈ సినిమా మే 5న విడుదల. ఈ సందర్భంగా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో ఒక జర్నలిస్ట్ ఆమెని “మీరు ఈ సినిమాలో చాలా వల్గర్ గా నటించారట కదా?” అని అడిగారు. దానికి ఆమె అక్కడ సరి అయిన సమాధానం చెప్పలేక కొంచెం ఇబ్బంది పడింది.
ఐతే, తన ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం ‘వల్గర్’ అంటే మీనింగ్ ఏంటి అని గూగుల్ లో సెర్చ్ చేసి ఒక స్క్రీన్ షాట్ పెట్టింది. అది సదర్ జర్నలిస్ట్ కి కౌంటర్ అన్నమాట.