హన్సికకు మరిన్ని చిక్కులు

వ్యక్తిగత విషయాలతో ఇబ్బంది పడుతోంది హన్సిక. భర్తకు దూరమైందనే పుకారు ఆమెపై ఉండనే ఉంది. దీనిపై ఆమె ఇప్పటివరకు స్పందించలేదు. సోలోగానే ఫొటోలు పోస్టు చేస్తోంది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు మరో వివాదం ఆమెను చుట్టుకుంది.
హన్సిక తమ్ముడు ప్రశాంత్, ముస్కాన్ అనే టీవీ ఆర్టిస్టును గతంలో పెళ్లాడాడు. వాళ్ల వైవాహిక జీవితం సాఫీగా సాగలేదు. చివరికి అది ఎంతవరకు వెళ్లిందంటే, హన్సిక కుటుంబంపై ముస్కాన్ కేసు పెట్టింది.
హన్సికతో పాటు ఆమె తల్లి, ఆమె తమ్ముడు ప్రశాంత్ పై కేసు పెట్టింది ముస్కాన్. ఈ కేసు నుంచి వెంటనే బెయిల్ దక్కించుకున్నారు హన్సిక, ఆమె తల్లి. అయితే కేసును కొట్టేయాల్సిందిగా ఆమె పెట్టుకున్న విజ్ఞప్తి మాత్రం తిరస్కరణకు గురైంది.
తనపై పెట్టిన కేసును కొట్టేయాలంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించింది హన్సిక. దీనికి హైకోర్టు నిరాకరించింది. ఇది కేవలం విడాకుల కేసు కాదని, వేధింపుల కేసని తెలిపిన హైకోర్టు.. హన్సిక పిటిషన్ లో బలమైన కారణాలు లేవని తేల్చేసింది. దీంతో హన్సికను రాబోయే రోజుల్లో ఈ కేసు వెంటాడుతూనే ఉంటుంది.