సొంత సినిమాని మర్చిపోయిన తేజ

Teja

దర్శకుడు తేజ ఒకప్పుడు టాప్ డైరెక్టర్. కొన్నాళ్ల క్రితం ఫామ్ కోల్పోయారు. ఆ తర్వాత సక్సెస్సులు దూరమయ్యాయి. ఐతే, ఆయన కసిగా తీసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సూపర్ హిట్టయింది. దాంతో, మళ్ళీ ఆయన ట్రెండ్ మొదలైంది అనిపించింది. కానీ ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా ‘సీత’ సినిమా తీసి మళ్ళీ వెంటనే పెవిలియన్ బాట పట్టారు.

2019లో విడుదలైంది ‘సీత’. ఆ తర్వాత పలు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఫైనల్ గా రానా సోదరుడు అభిరామ్ ని హీరోగా పరిచయం చేసే బాధ్యత తీసుకున్నారు తేజ. అలా ‘అహింస’ అనే సినిమా తీశారు. పోయిన దసరా పండుగ నుంచి ఇదిగో విడుదల అంటున్నారు కానీ అది విడుదల కావడం లేదు.

ఇప్పుడు మొత్తంగానే ఆ సినిమా విడుదల విషయాన్ని పక్కన పెట్టినట్లు ఉన్నారు తేజ. తాజాగా హీరో గోపిచంద్ నటించిన ‘రామబాణం’ సినిమా ప్రమోషన్ లో భాగంగా తేజ కూడా అందులో పార్టిసిపేట్ అయ్యారు. గోపీచంద్ ని ఆయన ఇంటర్వ్యూ చేశారు. వేరే వాళ్ళ సినిమాల ప్రొమోషన్ లో తేజ పాల్గొంటుండడంతో ఆయన సొంత సినిమానే మర్చిపోయారా అన్న కామెంట్స్ వస్తున్నాయి.

తేజ తీసిన ‘అహింస’లో నటించిన అభిరాం లుక్స్ వల్ల సినిమాకి క్రేజ్ రాలేదు. బిజినెస్ జరగలేదు. ఐతే, అభిరాం తండ్రి సురేష్ బాబు సొంతంగా విడుదల చెయ్యొచ్చు. కానీ ఆయన కూడా ఎందుకో హేజిటెట్ చేస్తున్నారు.

Advertisement
 

More

Related Stories