గ్లామర్ రూట్ నుంచి సైడ్ కి

Hebah Patel and Paayal Rajput

ఇటు హెబ్బా పటేల్, అటు పాయల్ రాజ్ పుత్… హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు. వీళ్ల హాట్ హాట్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలాంటి ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఇప్పుడు ఒకేసారి రూటుమార్చారు.

పల్లెటూరి పిల్ల పాత్రల్లోకి మారిపోయారు. డీ-గ్లామరైజ్డ్ పాత్రలతో ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

“ఓదెల రైల్వేస్టేషన్” అనే సినిమా చేస్తోంది హెబ్బా పటేల్. ఓదెల అనే గ్రామంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పల్లెటూరి పిల్లగా కనిపించనుంది హెబ్బా. ఆమెకు సంబంధించి ఇప్పటికే విడుదలైన స్టిల్స్ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. కచ్చితంగా ఈ క్యారెక్టర్ తనకు మంచి గుర్తింపునిస్తుందని చెబుతోంది హెబ్బా.

Also Check: Hebah Patel Stills

అటు పాయల్ రాజ్ పుత్ కూడా సడెన్ గా డీ-గ్లామరైజ్డ్ పాత్రలోకి మారిపోయింది. “అనగనగా ఒక అతిథి” సినిమా కోసం మాసిన లంగావోణీ కట్టుకొని పల్లెటూరి పిల్లగా మారిపోయింది. మేకప్ కూడా పూర్తిగా తగ్గించేసింది. అంతేకాదు.. ఈ క్యారెక్టర్ లో పేద అమ్మాయిగా కనిపించేందుకు జస్ట్ నెల రోజుల్లో 5 కిలోల బరువు కూడా తగ్గింది.

Also Check: Paayal Rajput Stills

ఇలా పాయల్-హెబ్బా ఒకేసారి డీ-గ్లామరైజ్డ్ రోల్స్ చేస్తున్నారు. వీళ్లలో ఎవరు ఎట్రాక్ట్ చేస్తారో చూడాలి.

Related Stories