నేను ఆ పబ్బుకి వెళ్ళలేదు: హేమ

- Advertisement -
Hema


ఆదివారం హైదరాబాద్ పోలీసులు రాడిసన్ బ్లూ హోటల్లో ఉన్న పబ్ పై దాడి చేశారు. రాత్రి రెండున్నరకి కూడా పబ్ నడుస్తోంది అన్న సమాచారంతో రైడ్ చేశారు. అలాగే మాదకద్రవ్యాలను తలపించే సరుకు కూడా దొరికింది. ఆ టైంలో పబ్ లో ఉన్న 140 మందిని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించి, వారిని విచారించి వదిలేశారు.

హీరోయిన్ నిహారిక కొణిదెల, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఉన్నారు వీరిలో.

అలాగే, నటి హేమ కూడా ఈ పబ్ లోనే ఫుల్లుగా చిందులేసి కనిపించింది అని, ఆమెని కూడా పొలీసు స్టేషన్ కి తరలించినట్లు టీవీ ఛానెల్స్ వార్తలు ప్రసారం చెయ్యడంతో ఆమె బయటికి వచ్చారు.

“అస్సలు నేను ఆ పబ్ కే వెళ్ళలేదు. నా పేరుని బద్నామ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు కొందరు,” అని ఆమె ఆరోపించారు.

 

More

Related Stories