విశ్వక్ కోసమే అదంతా!


హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ నివేద పేతురాజ్ మధ్య సంథింగ్ సంథింగ్ అని చాలా కాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళనాట ఒక హీరోతో గొడవపడి హైదరాబాద్ కి వచ్చిన నివేదకి విశ్వక్ సేన్ మద్దతుగా నిలిచాడట. అప్పటి నుంచి వీరి మధ్య స్నేహబంధం బలంగా పెనవేసుకొంది అనేది ఫిలింనగర్ టాక్.

ఈ పుకార్లకు తగ్గట్లే ఆమె విశ్వక్ సేన్ నటిస్తున్న సినిమాలో రెచ్చిపోయి గ్లామర్ షో చేసింది. వీరిద్దరి కాంబినేషన్ లో ‘దాస్ కా ధమ్కీ’ అనే సినిమా వస్తోంది. ఈ సినిమాలో వీరి మధ్య తీసిన రొమాంటిక్ సీన్లు, పాటలు ఒక విధంగా లేవు అంటున్నారు. వీరి ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ తెరపై కనిపిస్తోంది.

‘ధమ్కీ’ సినిమాకి సంబంధించిన ఒక టీజర్ వచ్చింది. ఇప్పుడు సాంగ్ ప్రోమో వచ్చింది. వీటిలో వీరి కెమిస్ట్రీ చూసి అప్పుడే జనం చెవులు కొరుక్కుంటున్నారు.

వచ్చే ఫిబ్రవరిలో విడుదల కానుంది ‘ధమ్కీ’.

 

More

Related Stories