హృతిక్ రెండో పెళ్ళికి రెడీ?

50ఏళ్ళు, 60 ఏళ్ళు దాటినా కూడా రెండో, మూడో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ నడుస్తోంది. మరీ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ రెండో పెళ్లి గురించి ఆలోచన చెయ్యకపోవడం వింతే కదా. భార్య సుజానేకి విడాకులు ఇచ్చి చాలా ఏళ్ళు అయింది. ఇన్నాళ్లూ ఆగిన హీరో ఇపుడు ఒక చిన్న హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడు.

ఎక్కువగా వెబ్ సిరీసులల్లో నటించే సభా ఆజాద్ అనే భామతో కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నాడు హృతిక్. ఇటీవల వీరు ఇద్దరూ బయటికి వస్తున్నారు జంటగా. కెమెరాలకు ఫోజులిస్తున్నారు. తమ బంధం బలపడింది అని హింట్ ఇస్తున్నారు. బాలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం ఇప్పుడు ఏడు అడుగుల వైపు నడుస్తున్నారట.

త్వరలోనే హృతిక్ రెండో పెళ్లి గురించి ప్రకటన రావొచ్చు అని అంటున్నారు.

హృతిక్ రోషన్ కి మొదటి భార్యతో ఇద్దరు పిల్లలు. ఆమె కూడా ఒక వ్యాపారవేత్తతో డేటింగ్లో ఉంది. ఆమె తరుచుగా కొత్త బాయ్ ఫ్రెండ్ ని హగ్ చేసుకుంటూ, ముద్దు పెట్టుకుంటూ ఫోటోలు షేర్ చేస్తుంటుంది.

 

More

Related Stories