ఆది సారీతో వివాదం వొడిసిందా?

TeluguCinema 16 Jun 2021
hyper aadi bathukammacontroversy

‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ అనే కార్యక్రమంలో తెలంగాణ బతుకమ్మ పండుగని అగౌరవపర్చేలా హైపర్ ఆది చేసిన కామెంట్స్ పై చాలా రగడ జరిగింది. దాంతో హైపర్ ఆది క్షమాపణలు కోరుతూ ఒక వీడియోని విడుదల చేశాడు.

ఈ వివాదం పోలీసు కేసు వరకు వెళ్ళింది. దాంతో క్షమాపణలు చెప్పక తప్పలేదు. ఐతే, నిర్మాణ సంస్థ, ప్రోగ్రాం రైటర్, డైరెక్టర్లు మాత్రం ఎలాంటి ప్రకటన చెయ్యలేదు.

“మా టీంలో ఆంధ్ర, తెలంగాణ అనే భేదాలు లేవు. అందరమూ కలిసే ఉంటాం, పనిచేస్తాం. అన్ని ప్రాంతాల వారి ప్రేమ, అభిమానాలు ఉంటేనే ఇంత ఎదిగాం. షోలో జరిగిన తప్పుకు నా తరుపున, ఆ రోజు స్టేజిపై ఉన్న అందరి తరుపున క్షమాపణ కోరుతున్నా’ అని హైపర్ ఆది వీడియోలో చెప్పాడు.

మరి, ఆది క్షమాపణలతో ఈ వివాదం వొడిసినట్లేనా? అనేది చూడాలి.