ఇక రోజూ జై కొడుతా: జాన్వీ

TeluguCinema 18 Aug 2025
Janhvi Kapoor Bharat Mata Ki Jai Slogan

ముంబైలో శ్రీకృష్ణుడి జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఉట్టి కొట్టేందుకు అందరూ ఉత్సాహం చూపుతారు. ఒక ఏరియాలో జరిగిన వేడుకల్లో జాన్వీ కపూర్ పాల్గొంది. ఆమెతో ఉట్టి కొట్టించారు అక్కడి నిర్వాహకులు. ఐతే, కార్యక్రమంలో భారత్ మాతా కీ జై అని చెప్పడంతో జాన్వీ కపూర్ ట్రోలింగ్ కి గురైంది.

ఈ సారి పంద్రాగస్టు, జన్మాష్టమి ఒకేవారంలో రావడంతో పాప కన్ఫ్యూజ్ అయినట్లు ఉంది అని ఇంటర్నెట్ లో జనం తెగ ఏడిపించారు ఆమెని. దాంతో, ఆ వీడియోని తాజాగా షేర్ చేస్తూ జాన్వీ కపూర్ స్పందించింది.

జన్మాష్టమి వేడుకల్లో ‘భారత్ మాతా కీ జై’ అనడం తప్పు కాదు అని పేర్కొంది. దేశభక్తి ఉన్నవాళ్లు ఎప్పుడైనా ఎక్కడైనా అలా అనొచ్చు అని ఆమె పేర్కొంది. అంతేకాదు, ఇకపై భారత్ మాతకు రోజూ జై కొడుతాను… మీరు ఏమైనా ట్రోలింగ్ చేస్కోండి అంటూ జాన్వీ ఇచ్చిపడేసింది.

జై శ్రీ కృష్ణ అనే బదులు ఆ విషయం మరిచిపోయి ఆమె భారత్ మాతా కీ జై అని నినాదాలు ఇచ్చింది. ఆ తప్పుని కవర్ చేసుకొనేందుకు ఇక ఇలా రోజూ అంటాను అని చెప్తోంది.

Janhvi Kapoor Bharat Mata Ki Jai Slogan

ఈ సుందరి ప్రస్తుతం తన కొత్త బాలీవుడ్ చిత్రం “పరమ్ సుందరి” సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఇక తెలుగులో ఆమె రామ్ చరణ్ సరసన “పెద్ది” చిత్రంలో నటిస్తోంది.