సంసారం ఆనందంగా ఉందట

Kajal Aggarwal

కాజల్ అగర్వాల్ చాలా ఏళ్ళు సినిమాల్లో వర్క్ చేసింది. దాదాపు 15 ఏళ్ళు హీరోయిన్ గా బిజీ బిజీగా గడిపింది. ఇద్దరు హీరోలతో డీప్ డేటింగ్ కూడా చేసింది. కానీ అన్నీ వదిలేసుకొని తెలిసిన బంధువుని పెళ్లాడింది.

ఐదేళ్ల తర్వాత మ్యారీడ్ లైఫ్ ఇంకా ఆనందంగా ఉందంటోంది.

కాజల్ అగర్వాల్, తన కుటుంబ మిత్రుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని 2020లో పెళ్లాడింది. రెండేళ్లకు వీరికి ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత ఆమె తెలుగులో “భగవంత్ కేసరి”, “సత్యభామ” చిత్రాలు పూర్తి చేసింది. ఇక ఈ ఏడాది హిందీలో “సికందర్”, తెలుగులో “కన్నప్ప” చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించింది.

ఇప్పుడు ఆనందంగా కుటుంబ బాధ్యతలు మోస్తూనే కెరీర్ ని కంటిన్యూ చేస్తోంది. ఇప్పుడు కెరీర్ కన్నా వ్యక్తిగత జీవితం ముఖ్యం అంటోంది. అదే ఆనందాన్ని ఇస్తోందట.

వచ్చే ఏడాది ఈ భామ రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవితో కలిసి “రామాయణ” చిత్రంలో కనిపించనుంది.

More

 

Related Stories