రెండు గెటప్పుల్లో కళ్యాణ్ రామ్

Kalyan Ram

కొత్త దర్శకులతో ఎప్పుడూ ప్రయోగాలు చేస్తూనే ఉంటారు నందమూరి కళ్యాణ్ రామ్. తాజాగా ఒక ఫాంటసీ మూవీ చేస్తున్నారు. అదే.. ‘బింబిసార’. వశిష్ఠ్ అనే ద‌ర్శ‌కుడిని ప‌రిచ‌యం చేస్తున్నారు ఈ మూవీతో. ఈ సినిమా మొదటిలుక్ లో కళ్యాణ్ రామ్ బింబిసారుడు అనే క్రూరమైన సైనికాధిపతి గెటప్ లో కనిపించారు.

ఐతే, సినిమా మొత్తం ఇదే లుక్ లో ఉంటాడా? కాదు అనే చెప్పాలి. ఈ సినిమాలో రెండు పీరియడ్స్ ఉంటాయి. వందల ఏళ్ల క్రితం నాటి కాలం బ్యాక్ డ్రాప్ లో కొంత భాగం కథ నడుస్తుంది. మరికొంత భాగం నేటి నేపథ్యంలో సాగుతుంది. రెండు వైవిధ్యమైన గెటప్పులో కనిపిస్తారు కళ్యాణ్ రామ్.

‘మగధీర’ సినిమాకి దీనికి పోలికలు లేవు. ఇందులో కళ్యాణ్ రామ్ బింబిసారుడుగా నెగెటివ్ ఛాయల్లో కనిపిస్తాడు.ఆల్మోస్ట్ విలన్ పాత్ర. అదే మెయిన్ హైలైట్.

Advertisement
 

More

Related Stories