మరోసారి కమల్ తో సేతుపతి

Vijay Sethupathi

కమల్ హాసన్, విజయ్ సేతుపతి… ఈ కాంబినేషన్ లో సినిమాకి ఉన్న క్రేజ్ ఏంటో ‘విక్రమ్’ సినిమా చూపించింది. కమల్ హీరోగా, విజయ్ సేతుపతి విలన్ గా నటించిన ఆ సినిమా సంచలన విజయం సాధించింది. కమల్ హాసన్ కెరీర్ కి మళ్ళీ ఊపు తెచ్చింది.

దాంతో, కమల్ ఇప్పుడు అనేక చిత్రాల్లో నటిస్తున్నారు. ‘ఇండియన్ 2’, ‘విక్రమ్ 2’ ఇలా చాలా సినిమాలు లైన్లో ఉన్నాయి. తాజాగా కమల్ హాసన్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో మరో సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి.

హెచ్.వినోద్ అనే దర్శకుడు కమల్ హాసన్ తో తదుపరి చిత్రం చెయ్యనున్నాడు. కార్తీ హీరోగా ‘ఖాకీ’, అజిత్ తో మూడు సినిమాలు డైరెక్ట్ చేసిన వినోద్ ఇప్పుడు కమల్, విజయ్ సేతుపతి కాంబినేషన్ సెట్ చేశాడట. కమల్ హాసన్ స్వయంగా ఈ సినిమాని నిర్మించనున్నారు.

మరోవైపు, విజయ్ సేతుపతి కూడా హీరో వేషాలు మానేసి పెద్ద సినిమాల్లో విలన్ గా, కీలక పాత్రలు చేస్తూ బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇప్పటికే తెలుగులో నటించిన విజయ్ సేతుపతి త్వరలోనే హిందీలో కూడా రెండు సినిమాల్లో కనిపించనున్నారు. అవి షూటింగ్ దశలో ఉన్నాయి.

 

More

Related Stories