మళ్ళీ అదే ‘సింపతీ కార్డు’

Kiran Abbavaram

కిరణ్ అబ్బవరం గత ఏడాది “క” అనే సినిమా సమయంలో సింపతీ కార్డు ఉపయోగించాడు. ఆ సినిమా అతన్ని అపజయాలనుంచి బయటపెట్టింది. తన సినిమాకి థియేటర్లు ఇవ్వట్లేదు అని సింపతీ కార్డు వాడాడు. తెలుగునాటే కాదు తమిళనాడులో కూడా అదే మాట మాట్లాడాడు. తన సినిమా తమిళనాడులో విడుదల చెయ్యడానికి అక్కడ థియేటర్లు ఇవ్వలేదు అని చెప్పాడు.

ఇప్పుడు “కె-రాంప్” అనే సినిమా విడుదల అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ లలో కూడా అదే డైలాగ్ చెప్తున్నాడు. ప్రదీప్ రంగనాధన్ లాంటి తమిళ హీరోకు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు దొరుకుతున్నాయి కానీ తనలాంటి తెలుగు హీరోలకు తమిళనాడులో సినిమాలు విడుదల చేసేందుకు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లు లేవని అంటున్నారు అని మళ్ళీ చెప్పాడు.

తమిళనాట మన తెలుగు హీరోల సినిమాలకు అంత ఆదరణ ఉండదు అనే మాట నిజమే. ఐతే, కిరణ్ అబ్బవరం నటించిన “క” తర్వాత తమిళనాడులో విడుదలైంది కానీ ఎవరూ చూడలేదు. నిజంగా ఆయన సినిమాలో దమ్ముంటే మిగతా మలయాళ, హిందీ భాషల్లో కూడా ఆడాలి కదా. అక్కడ కూడా థియేటర్లు ఇవ్వడం లేదా?

ప్రదీప్ రంగనాథన్ కి అయినా, విజయ్ ఆంటోనికైనా ఒక సాలిడ్ హిట్ తెలుగులో పడిన తర్వాతే థియేటర్లు దక్కుతున్నాయి. వాళ్ళకి హిట్స్ లేకపోతే వాళ్ళ సినిమాలకు కూడా ఇక్కడ థియేటర్లు దక్కవు. అలాగే, కిరణ్ అబ్బవరం ముందు ఒక పాన్ ఇండియా హిట్ కొడితే ఆటోమాటిక్ గా తమిళనాట కూడా థియేటర్లు దక్కుతాయి. తెలుగులో తప్ప “క” ఎక్కడా ఆడలేదు. ఆ తర్వాత వచ్చిన సినిమా అన్ని చోట్లా ఢమాల్.

ముందు హిట్ కొడితే, ఆటోమేటిక్ గా అన్నీ దక్కుతాయి. “కాంతార” మొదటి భాగం హిట్ అయింది కాబట్టి తమిళనాడులో రిషబ్ శెట్టి కొత్త సినిమాకి అంత భారీ ఓపెనింగ్ వచ్చింది.

More

 

Related Stories