కృష్ణ… నిర్మాతల హీరో


ఘట్టమనేని కృష్ణ…. నిజమైన సూపర్ స్టార్. వెండితెరపైనే కాదు నిజజీవితంలో కూడా ఆయన హీరో. హీరోలు ఎక్కువగా తమ పారితోషికం, తమ ఆస్తుల గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారు అనే అపవాదు ఉంది. అందులో నిజం కూడా ఉంది. దానికి భిన్నంగా నిర్మాతల కోసం, తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం పని చేసిన హీరో… సూపర్ స్టార్ కృష్ణ.

1960, 70లలో దాదాపు నటులందరూ ఏడాదికి ఐదారు సినిమాలు చేసేవారు. కానీ, కృష్ణ ఏకంగా ఏడాదికి 10 నుంచి 15 సినిమాలు చేసేవారు. ఆయన నిద్రపోతున్నప్పుడు కూడా ఆయన నిద్రిస్తున్న షాట్ లు తమ సినిమాల్లో ఎక్కడో సందర్భంలో వాడుకునేలా వాటిని కూడా తీసుకునేవారు అనే ప్రతీతి. అంత బిజీగా ఉండేవారు అని చెప్పడానికి అలా చెప్పేవారు.

కృష్ణ ఒక ఏడాదిలో 17 చిత్రాలు విడుదల చేశారు. అది ఒక రికార్డు.

తాను ఎక్కువ సినిమాలు చేస్తే ఎక్కువ మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుంది అని భావించి అలా సినిమాలు ఒప్పుకునేవారు సూపర్ స్టార్ కృష్ణ. ఎవరైనా నిర్మాత తనతో సినిమా తీసి నష్టపోతే మళ్ళీ వాళ్ళకే తక్కువ పారితోషికం తీసుకొని మరో సినిమా చేసి నష్టాన్ని పూడ్చేవారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు అనుకునే నిర్మాతలకు, దర్శకులకు పిలిచి మరీ వాళ్లకు తన డేట్స్ ఇచ్చేవారు.

Advertisement
 

More

Related Stories