డేట్స్ లేవా? ఇష్టం లేదా?

Krithi Shetty

‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన కృతి శెట్టికి చాలా క్రేజ్ వచ్చింది. మొదటి సినిమా విడుదల కాకముందే ఆఫర్లు వచ్చాయి. ఇక ‘ఉప్పెన’ రిలీజ్ తర్వాత మరింత పాపులారిటీ పెరిగింది. ఆఫర్లు కూడా పెరిగాయి. ఐతే, ఇప్పుడు ఈ భామ పెద్ద సినిమాలు, మీడియం రేంజు హీరోల సినిమాలకు మాత్రమే ఓటేస్తోందట. చిన్న హీరోల సినిమాల సరసన అంటే… డేట్స్ లేవు అని చెప్తోంది.

నిజానికి ఆమె డేట్స్ దగ్గర డేట్స్ లేని పరిస్థితి లేదు. నాని సరసన ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా, సుధీర్ బాబు – ఇంద్రగంటి మూవీ, రామ్ -లింగుస్వామి సినిమాలు మాత్రమే ఒప్పుకొంది. ‘శ్యామ్ సింగ రాయ్’లో ఆమె మెయిన్ హీరోయిన్ కాదు. ఆ సినిమా కూడా చివరి దశకు చేరుకొంది. మిగతా రెండు సినిమాలకు మాత్రమే ఆమె డేట్స్ ఇవ్వాలి.

ఒక హీరోయిన్ సులువుగా ఏడాదికి ఐదు సినిమాలకు డేట్స్ ఇవ్వగలదు. కృతి మాత్రం రెండు సినిమాలు ఒప్పుకొని డేట్స్ లేవంటోంది. అంటే ఆమె పెద్ద సినిమాల కోసం వెయిట్ చేస్తోందనుకోవాలి.

Advertisement
 

More

Related Stories