అనుష్క కోసం లాఠీఛార్జ్

అనుష్క క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో పంజాగుట్ట సర్కిల్ వద్ద అనుష్క పోస్టర్ పెద్దది పెడితే, చాలా యాక్సిడెంట్స్ అయ్యాయంట. ఆమెకున్న క్రేజ్ అలాంటిది. ఇప్పుడు అలాంటిదే మరో ఘటన బయటకొచ్చింది.
అనుష్కను చూడ్డానికి జనం వస్తే, వాళ్లను కంట్రోల్ చేయడానికి పోలీసులు 3 సార్లు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చిందంట. ‘ఘాటీ’ సినిమా షూటింగ్ టైమ్ లో ఇది జరిగిందని చెబుతున్నాడు నిర్మాత రాజీవ్ రెడ్డి.
“ఘాటీలో అనుష్క నటన నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఒరిస్సాలో ఒక బార్డర్ ఏరియాలో మేము షూట్ చేశాం. షూట్ కి వెళ్ళేటప్పుడు వేలాది జనం అనుష్కను చూడ్డానికి వచ్చారు. క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి 2-3 సార్లు పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. అనుష్కకి దేశవ్యాప్తంగా ఆ స్థాయిలో ప్రేక్షకాదరణ ఉంది.”
ALSO READ: Anushka Shetty’s promotion schedule in September and October
ఇలా ‘ఘాటీ’ షూటింగ్ లో జరిగిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు నిర్మాత. తాము ఒరిస్సాలోని ఓ మారుమూల ప్రాంతంలో షూటింగ్ చేశామని, అక్కడకు కూడా అనుష్కను చూసేందుకు వేలాది మంది తరలిరావడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు ఈ నిర్మాత.