దేవదాసుగా మారిన లోకేష్

TeluguCinema 02 Nov 2025
DC

తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా మారాడు. డైరెక్ట్ చేస్తూనే సినిమాల్లో నటిస్తాడట. చాలామంది తమిళ దర్శకులకు నటించడం అంటే ఇష్టం. అదీ కూడా హీరోగా సినిమాలు చెయ్యడం మరీ మరీ ఇష్టం. ఆ కోవలో ఈ యువ దర్శకుడు హీరో అయ్యాడు.

హీరోగా అతని మొదటి చిత్రం.. దేవదాసు కథే. దేవదాసుగా లోకేష్ కనగరాజ్ నటిస్తుండగా, చంద్రముఖిగా వామిక నటిస్తోంది. పార్వతి ఎవరు అనేది తెలియదు. ఈ సినిమాకి … DC అని పెట్టారు. అంటే దేవదాసు, చంద్ర అనే పేర్లకు షార్ట్ ఫామ్.

పేరుకే దేవదాసు కథ కానీ దీనికి లోకేష్ తన డైరెక్టర్ గా చేసిన సినిమాల్లో మాదిరిగానే కనిపిస్తున్నాడు. ముఖం అంతా రక్తం పూసుకొని, అప్పుడే ఎవరినో గన్నుతో చంపి వస్తున్నట్లు టైటిల్ టీజర్లో చూపించారు. వామిక కండోమ్ పాకెట్ పట్టుకొని నిరీక్షిస్తున్నట్లు చూపించారు.

పాత దేవదాసు కథకు కొత్త క్రైం టచ్ ఇస్తున్నారు. అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి అనిరుధ్ తన పాత పద్దతిలోనే ఇంగ్లీష్ లో ఒక పాట పాడి దాన్ని బ్యాగ్రౌండ్ గా మార్చాడు. అనిరుధ్ కి ప్రతి సినిమాలో ఒక ఇంగ్లీషు పాట పాడి వాడే అలవాటు ఉంది.