అలా చేస్తే పోటీ చెయ్యను: విష్ణు

- Advertisement -
Manchu Vishnu

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాని ప్రకటించిన మంచు విష్ణు లేటెస్ట్ గా సుదీర్ఘ లేఖ విడుదల చేశారు. వీడియో సందేశం కూడా పంపారు.

“మా బిల్డింగ్ కి కావాల్సిన మొత్తాన్ని తానే ఇస్తాను,” అని చెప్తున్నారు విష్ణు. తమ కుటుంబమే ఆ బిల్డింగ్ కట్టిస్తుందని హామీ ఇస్తున్నారు విష్ణు. పోటీ నుంచి కూడా తప్పుకుంటానని కూడా అంటున్నారు. ఐతే, ఇవన్నీ జరగాలంటే ముందు ఇండస్ట్రీలోని పెద్దలందరూ ఎన్నికలను ఏకగ్రీవం చేస్తామని చెప్పాలి అని మెలిక పెట్టారు.

అప్పుడే పోటీ నుంచి తప్పుకుంటా… లేదంటే పోటీకి సై అని తేల్చి చెప్పారు మంచు విష్ణు.

“ఏకగ్రీవం కాకపోతే పోటీకి నేను సిద్ధం. పెద్దలను గౌరవిస్తాం. వాళ్ల సలహాలు పాటిస్తాం. మా యంగ్ జనరేషన్‌ని ఆశీర్వదించి.. మా ప్రెసిడెంట్‌గా నన్ను బలపరుస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా,”ను అంటూ ముగించారు మంచు విష్ణు.

VISHNU MANCHU ON MAA

“మా” ఎన్నికలకు ఇంకా తేదీలు ప్రకటించలేదు. కానీ అప్పుడే లొల్లి పీక్స్ కెళ్ళింది. ప్రకాష్ రాజ్, విష్ణు, హేమ, జీవిత, సీవీఎల్ పోటీలో ఉన్నట్లు చెప్పారు.

More

Related Stories