సూపర్ స్టార్లు: ఇద్దరికీ గోల్డెన్ ఇయర్

సూపర్ స్టార్ రజినీకాంత్, సూపర్ స్టార్ మహేష్ బాబు…ఇద్దరికీ ఈ ఏడాది, ముఖ్యంగా ఈ ఆగస్టు చాలా ప్రత్యేకం. ఈ రోజు (ఆగస్టు 9) మహేష్ బాబు 50వ పుట్టిన రోజు. అంటే మహేష్ బాబుకి వ్యకిగా ఇది గోల్డెన్ జూబ్లీ.
ఇక సూపర్ రజినీకాంత్ కి కూడా ఇది గోల్డెన్ జూబ్లీ. ఆయన నటుడిగా 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. గోల్డెన్ జూబ్లీ ఇయర్లో “కూలీ” విడుదల అవుతోంది. ఆగస్టు 14న రిలీజ్. రజినీకాంత్ కి ఇది గోల్డెన్ జూబ్లీ కాబట్టి దర్శకుడు లోకేష్ కనగరాజ్ గోల్డ్ వాచుల కథ సిద్ధం చేశాడా? ఏమో. ఈ సినిమాలో మాత్రం ‘గోల్డ్’ అనేది ఒక స్టోరీ పాయింట్.
రజినీకాంత్ ఈ వయసులో కూడా బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నారు. “కూలీ”కి కళ్ళు చెదిరే ఓపెనింగ్ రానుంది. గోల్డెన్ ఇయర్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేలా ఉన్నారు.
ఇక మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో నటిస్తున్నారు. ఆయన్ని గ్లోబల్ స్టార్ గా మలిచే సినిమా ఇది. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోంది.
ALSO READ: Mahesh Babu turns 50: An affable Superstar!
ఇక మహేష్ బాబు రెండేళ్లకు పైగా రాజమౌళి సినిమాపైనే ఉంటారు. మహేష్ బాబు ఇప్పటివరకు పాన్ ఇండియా చిత్రాలు చెయ్యలేదు. ఇప్పుడు ఏకంగా గ్లోబల్ లెవల్లో సినిమా చేస్తున్నారు. సో, మహేష్ బాబుకి ఇది చాలా స్పెషల్.