సూర్య మూవీలో రష్మిక డౌటే?

రష్మిక మందాన అంటే “నేషనల్ క్రష్”. అవును… ఇటీవలే గూగుల్ ఆన్ లైన్ ట్రెండ్స్ సర్వేలో తేలిందంటంటే జాతీయస్థాయిలో కుర్రకారు… రష్మిక అంటే తమకి “క్రష్” అని చెప్పారు. అంటే వాళ్ళకి ఆమె బాగా “అది” అని అర్థం. అందుకే కాబోలు… మరింతగా అభిమానులను పొందేందుకు ఈ భామ కొంచెం గ్లామర్ డోస్ పెంచుతోంది.

లేటెస్ట్ గా చేస్తోన్న ఫోటోషూట్ లలో బాగా స్టయిల్ గా మారుతోంది. ఫొటోల్లో కూడా కొంత స్కిన్ షో చేస్తూ అబ్బాయిలకు కనువిందు కలిగిస్తోంది.

మరోవైపు, సూర్య కొత్త సినిమాలో రష్మిక హీరోయిన్ గా సెలెక్ట్ అయిందన్న వార్తలను నిర్మాత, దర్శకుడు తోసిపుచ్చారు. ఆమె పేరు మెన్షన్ చెయ్యకుండా… “ఆ ప్రచారాన్ని నమ్మొద్దు. మా సినిమాలో నటించే నటీనటుల, సాంకేతిక నిపుణల వివరాలు మేమే ప్రకటిస్తాం. అప్పటివరకు ఈ వార్తలను నమ్మొద్దు,” అని దర్శకుడు పాండురాజు ట్వీట్ చేశాడు.

సో, రష్మిక సూర్య సరసన కన్ఫర్మ్ అయిందనేది ఇప్పటివరకు ఒక ఊహాగానమే. ఫైనల్ గా సినిమాలో వుంటుందా అనేది ఇప్పుడే చెప్పలేము. ఈ ట్వీట్ ని బట్టి చూస్తే ఆమె ప్రాజెక్ట్ లోకి రావడం డౌటే.

More

Related Stories