కేంద్రమంత్రిగా పవన్? నిజమా, పులిహోరా?

TeluguCinema 15 Jun 2021


pawan kalyan shootingmeeting

త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ తన క్యాబినెట్ ని విస్తరించనున్నారు. దాంతో, కొత్తగా ఎవరెవరు మంత్రివర్గంలోకి వస్తారనే విషయంలో జాతీయ మీడియాలోనూ, మన లోకల్ మీడియాలోనూ ఊహాగానాలు మొదలయ్యాయి.

సడెన్ గా తెలుగు మీడియా… పవన్ కళ్యాణ్ కి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని హడావిడి చేస్తోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బీజేపీకి మిత్రపక్షమే. కానీ, జనసేనకి ఎంపీలు లేరు.ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా అధికార వైఎసార్సీపీలో చేరారు. ఐతే, పవన్ కళ్యాణ్ కి ఉన్న జనాకర్షణ, సామజిక వర్గం కోణంలో ఆయనకి మంత్రి పదవి ఇవ్వనున్నారని మీడియా హంగామా చేస్తోంది.

నిజంగా బీజేపీకి ఆ ఆలోచన ఉందా? లేక మన తెలుగు మీడియా రెగ్యులర్ గా వండి వార్చే ‘పులిహార’నేనా అన్నది చూడాలి.

పవన్ కళ్యాణ్ గత రెండు నెలలుగా మౌనం వహిస్తున్నారు. బయటికి రావడం లేదు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా ఇంటిపట్టునే ఉంటున్నారు.