‘మిరాయి’ మ్యూజిక్ డైరెక్టర్ ఖాతాలో 4

“మిరాయ్” సినిమాకి యువ సంగీత దర్శకుడు గౌర హరి ఇచ్చిన మ్యూజిక్ పెద్ద అస్సెట్. మొదట హనుమాన్ సినిమాతో విజయం అందుకున్నాడు. ఇప్పుడు మిరాయితో మరో విజయం. దాంతో, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించే నాలుగు కొత్త సినిమాలను సైన్ చేశాడు.
“సినిమా విడుదల తర్వాత చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. . అందరికీ మ్యూజిక్ చాలా నచ్చింది. ఇందులో శ్రీరాములవారి ఆయుధం అయినప్పటికీ దానికి పినాక అనే పేరు ఉంది. ఆ స్ఫూర్తితో శివుడి స్త్రోత్రం శైలిలో మ్యూజిక్ చేశాను. ఇంటర్వల్ బ్యాంగ్‌లో నాలుగు రకాల సౌండ్‌ని మిక్స్ చెయ్యడం చాలా ఆనందాన్ని ఇచ్చింది,” అని చెప్పారు హరి గౌర.
“నేను దర్శకుల నమ్మకం పొందడానికి చాలా కష్టపడ్డాను. మొదట ‘చార్మినార్’ అనే కన్నడ చిత్రంతో హిట్ వచ్చింది. తెలుగులో తుంగభద్ర, డియర్ మేఘ, గాలివాన లాంటి సినిమాలకు పని చేశాను.”
“ప్రశాంత్ వర్మ గారు మొదట ‘హనుమాన్’ కోసం ఒక పాట చేసే అవకాశం ఇచ్చారు. అదే “పూలమ్మె పిల్ల” సాంగ్. అది ఆయనకి నచ్చింది. దాంతో నేపథ్య సంగీతం కూడా చెయ్యమన్నారు. ఆ సినిమా విజయం గొప్ప నమ్మకాన్ని ఇచ్చింది. అలా మిరాయితో పాటు మరికొన్ని అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీలోనే నాలుగు ప్రాజెక్ట్స్ చేస్తున్నాను,” అని వివరించారు.