మళ్ళీ కలిసేదె లే!

- Advertisement -
Naga Chaitanya and Samantha


నాగ చైతన్య, సమంత విడిపోయి ఆరు నెలలు అయిపోయింది. విడిపోతున్నట్లు అక్టోబర్ (2021)లో ప్రకటించారు. కానీ, అంతకుముందు రెండు నెలల నుంచే విడిగా ఉంటున్నారు. ఓవరాల్ గా ఆరు నెలలు దాటిపోయింది వారు విడిపోయి. ఐతే, తాజాగా వీరిద్దరూ మళ్ళీ కలవబోతున్నారు అని, విడాకుల ఆలోచన విరమించుకున్నారని సోషల్ మీడియాలో వార్త తిరిగింది.

తెలుగుసినిమా.కామ్ ఈ విషయంలో క్రాస్ చెక్ చేసింది. నాగ చైతన్య, సమంతకి సన్నిహిత బృందం ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది.

“వాళ్ళు మానసికంగా విడిపోయి చాలా కాలమే అయింది. కలిసి ఉండలేని పరిస్థితుల్లోనే విడిపోయారు. ఇరువైపులా పెద్దలు, స్నేహితులు అందరూ అన్ని ప్రయత్నాలు చేశాకే వాళ్ళు విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇక ఇప్పుడు మళ్ళీ కలవడం అనేది ఒట్టి మాట. ఇదంతా సోషల్ మీడియాలో లైకుల కోసం చేస్తున్న ప్రయత్నమే,” అనేది వారి మాట.

లీగల్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. అది కూడా వస్తే… ఇద్దరూ వారి వారి జీవితాల్లో ముందుకెళ్తారు.

ప్రస్తుతం సమంత స్విట్జర్లాండ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. నాగ చైతన్య ‘థాంక్యూ’ సినిమా షూటింగ్ కోసం రష్యాలో ఉన్నాడు.

 

More

Related Stories