- Advertisement -

అనుపమ పరమేశ్వరన్ ఎక్కువగా తన ఫోటోలు మాత్రమే షేర్ చేస్తుంటుంది ఇన్ స్టాగ్రామ్ లో. ఆదివారం ఆమె పెట్టిన కొన్ని ఫోటోలు మాత్రం చర్చకి దారి తీశాయి.
ఆమె తాజాగా పెట్టిన ఫోటోలు వైన్ గురించి. “ఉల్లాసకరమైన ఈ రాత్రులు వైన్ కోసమే,” అంటూ రెండు ఫోటోలను షేర్ చేసింది. ఆమె వైన్ ని ప్రోమోట్ చెయ్యడం చాలా మందికి నచ్చలేదు. కామెంట్స్ లో ఎక్కువగా ఆమెని విమర్శిస్తున్నవే ఉన్నాయి.
అనుపమ పరమేశ్వరన్ ఇటీవల బోల్డ్ గా మారుతోంది. “రౌడీ బాయ్స్”లో ఆమె అలాగే నటించింది. ముద్దులు, బెడ్ రూమ్ సీన్లు చేసింది. ఇప్పుడు వైన్ ని ఎంజాయ్ చేస్తున్నట్లు ఫోటోలు పెట్టడంతో ఆమె గురించి డిస్కషన్ మొదలైంది.
అనుపమ ఈ ఏడాది మరో రెండు సినిమాల్లో కనిపించనుంది. ఆ రెండూ (“18 పేజెస్”, “కార్తికేయ 2”) కూడా హీరో నిఖిల్ సిద్ధార్థ్ సరసన కావడం విశేషం.