వరుణ్ తేజ్ పని పూర్తి

- Advertisement -
Varun Tej


వరుణ్ తేజ్ బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు పూర్తి చేశాడు. సోలో హీరోగా నటిస్తున్న ‘గని’, మల్టీస్టారర్ మూవీ “ఎఫ్ 3″… రెండూ రిలీజ్ కి రెడీ గా ఉన్నాయి. ఈ రెండూ చిత్రాలు కరోనా వల్ల ప్రొడక్షన్ లో ఇబ్బందులు, వాయిదాలు చూసినవే.

మొత్తానికి ఈ వేసవిలో ఈ రెండూ విడుదల కానున్నాయి. లేటెస్టుగా ‘గని’ సినిమాకి సంబంధించిన అన్ని పనులు పూర్తి చేశాడు. డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయని, ఈ సినిమాకి చెందిన వర్క్ మొత్తం ఐపోయినట్లే అని చెప్పాడు వరుణ్ తేజ్. అన్ని అనుకున్నట్లు జరిగితే, ‘గని’ వచ్చే నెల విడుదల అవుతుంది. వేరే పెద్ద సినిమాలు పోటీకి దిగకపోతేనే ఇది నెక్స్ట్ మంత్ వస్తుంది. లేదంటే మరోసారి వాయిదా పడాల్సిందే.

వెంకటేష్ తో వరుణ్ తేజ్ కలిసి నటించిన “ఎఫ్ 3” ఒక పాట మినహా పూర్తి అయింది.

ఇక వరుణ్ తేజ్ తన కొత్త సినిమాల గురించి ఆలోచించాలి. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఇది కాకుండా మరో రెండు సినిమాలు లైనప్ చేసే ఆలోచనలో ఉన్నాట్ట.

వరుణ్ తేజ్, వరుణ్ తేజ్ మూవీస్, గని, ఎఫ్ 3,

 

More

Related Stories