సోదరిని పరిచయం చేస్తున్న నాని

TeluguCinema 14 Jun 2021
Meet Cute Launch

హీరో నాని డైరెక్టర్ కావాలని సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. కొన్ని సినిమాలకు సహాయ దర్శకుడిగా పని చేశారు. ఐతే, ఇంద్రగంటి మోహన కృష్ణ ఆయన్ని ‘అష్టాచెమ్మా’ సినిమాతో హీరోగా పరిచయం చెయ్యడంతో నాని లైఫ్ మారిపోయింది. ఇప్పుడు నాని వెరీ పాపులర్ హీరో. నాని కల ఆయన సిస్టర్ నెరవేర్చుతున్నారని చెప్పాలి. ఆమె మెగాఫోన్ పడుతున్నారు.

నాని సోదరి దీప్తి గంటా దర్శకురాలిగా మారుతున్నారు. ఆమె డైరెక్ట్ చేస్తున్న ఫస్ట్ మూవీ ఈ రోజు ప్రారంభమైంది. ‘మీట్ క్యూట్’ పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. నాని ఈ సినిమాకి నిర్మాత.

తెలుగులో మహిళా దర్శకుల సంఖ్య తక్కువే. ఆ జాబితాలోకి దీప్తి గంటా చేరనుండడం విశేషం.