నారప్ప వెనక్కి తగ్గలేడు

- Advertisement -
Venkatesh

థియేటర్లు నడిచేందుకు అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్‌ ల్లో మార్గం సుగమం అయింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. కానీ థియేటర్ల వ్యాపారం పుంజుకునేందుకు ఇంకా టైం పట్టేలా ఉంది. థియేటర్ల యాజమాన్యాలకు అనేక సమస్యలు కూడా ఉన్నాయి.

ఐతే, ఓటిటి రూపంలో ముంచుకొస్తున్న ప్రమాదం నేపథ్యంలో ఇటీవల ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. పెద్ద సినిమాలను ఓటిటికి అమ్మొద్దని వారు విజ్ఞప్తి చేశారు. మరి దగ్గుబాటి సురేష్ బాబు వారి విజ్ఞప్తికి స్పందిస్తారా? ఆయన నిర్మాతనే కాదు డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ కూడా. సురేష్ బాబు ఇప్పటికే వెంకటేష్ నటించిన ‘దృశ్యం 2’ సినిమాని డైరెక్ట్ గా హాట్ స్టార్ లో రిలీజ్ చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఆ డీల్ క్లోజ్ అయింది.

అలాగే వెంకటేష్ నటించిన మరో సినిమా ‘నారప్ప’ని కూడా డైరెక్ట్ గా అమెజాన్ లో రిలీజ్ చేసేందుకు చర్చలు పూర్తి చేశారు. కానీ ఈ డీల్ ఇంకా అఫీషియల్ గా సైన్ కాలేదు. మరి, ఇప్పుడు ‘నారప్ప’ డీల్ ని ఆపి థియేటర్లో రిలీజ్ చేసేందుకు సురేష్ బాబు ప్రయత్నిస్తారా?

తెలుగుసినిమా.కామ్ కున్న సమాచారం ప్రకారం సురేష్ బాబు ఈ రెండు సినిమాలను ఒటిటి వేదికల్లోనే విడుదల చెయ్యాలని ఫిక్స్ అయ్యారు. ఆ నిర్ణయంలో మార్పు ఉండకపోవచ్చు. ఎందుకంటే… ఈ రెండు చిత్రాలు కూడా థియేటర్లలో కన్నా ఓటిటీ వేదికల్లోనే బెటర్ గా ఉంటాయి అనేది ఒక అభిప్రాయం.

More

Related Stories