సంక్రాంతికి ఇంకా ఎన్ని వస్తాయి?

సంక్రాంతి 2026 సీజన్ లో మరో సినిమా చేరింది. ఇప్పటికే చిరంజీవి నటిస్తున్న “మన శంకర వరప్రసాద్ గారు”, ప్రభాస్ నటిస్తున్న “ది రాజా సాబ్”, నవీన్ పోలిశెట్టి “అనగనగా ఒక రాజు” సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి. కుదిరితే పొంగల్ పోటీలో తన సినిమాని కూడా చేర్చాలని రవితేజ భావిస్తున్నాడు.
రవితేజ, అషిక రంగనాథ్ జంటగా కిషోర్ తిరుమల తీస్తున్న సినిమా కూడా సంక్రాంతి పోటీకి సిద్ధం అవుతోంది. తాజాగా శర్వానంద్ కూడా ఈ రేస్ లో చేరుతున్నట్టు ప్రకటించాడు.
శర్వానంద్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరో, హీరోయిన్లుగా రూపొందిన “నారి నారి నడుమ మురారి” కూడా పొంగల్ పోటీలో ఉందట. తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఇక విజయ్ హీరోగా నటించిన తమిళ చిత్రం “జన నాయగాన్” కూడా పోటీలో ఉంది. ఇన్ని సినిమాలకు థియేటర్లు ఎలా దొరుకుతాయి?
సంక్రాంతి పండక్కి చాలా సినిమాలు కర్చీఫులు వేసినా, ఇందులో ఎన్ని బరిలో ఉంటాయి? ఎన్ని తప్పుకుంటాయి?