భార్యలతో ఎన్టీఆర్, చరణ్ జపాన్ వాక్!

ఎన్టీఆర్, రామ్ చరణ్ జపాన్ లో ఉన్నారు. జపాన్ లో ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా విడుదల సందర్భంగా ప్రొమోషన్ కోసం అక్కడ హల్చల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ తన భార్య లక్ష్మి ప్రణతితో, రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి టోక్యోలోని ఒక బిజీ కూడలిలో క్యాట్ వాక్ చేస్తూ వెళ్లారు. ఆ వీడియో వైరల్ అయింది.

ఇక్కడ ఇండియాలో రోడ్ల మీద ఈ హీరోలు ఎలాగూ తిరగలేరు. అందుకే, ఈ బాదరబందీ లేని టోక్యో వీధుల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకరో ఇద్దరో ఫ్యాన్స్ కనిపిస్తే ఆటోగ్రాఫ్ లు ఇస్తున్నారు.

మొత్తానికి, ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రమోషన్ కన్నా తమ భార్యలతో వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నారు ఈ హీరోలు ఇద్దరూ. వీరిద్దరితో పాటు రాజమౌళి, ఆయన భార్య రమా, రమా కొడుకు కార్తికేయ ఆయన భార్య పూజ కూడా చరణ్, ఎన్టీఆర్ లతో జపాన్ ట్రిప్ లో ఉన్నారు.

ఇక వచ్చే నెలలో వీరంతా అమెరికా వెళ్తారు. ఆస్కార్ అవార్డుల కోసం క్యాంపెన్ మొదలుపెడుతారు.

 

More

Related Stories