టాప్ గేర్లో పాన్ ఇండియా స్టార్!

Prabhas

నేడు (అక్టోబర్ 23) ప్రభాస్ పుట్టిన రోజు. ప్రభాస్ ఇప్పుడు కేవలం ఒక తెలుగు హీరో మాత్రమే కాదు. బాలీవుడ్ సూపర్ స్టార్లకు సమానమైన క్రేజ్ ఉన్న ఆలిండియా హీరో. పాన్ ఇండియా స్టార్ అని అభిమానులు పిలుచుకుంటున్నారు. సినిమాకి 100 కోట్ల పారితోషికం. గతంలో ఏడాదికి లేదా రెండేళ్ళకి ఒక మూవీ విడుదల చేసేవారు ప్రభాస్. కానీ ఇప్పుడు పంథా మారింది. ఒకేసారి 4 సినిమాలను సెట్స్ పై ఉంచి ట్రెండ్ మార్చేశారు.

విడుదలకు సిద్ధంగా ఉన్న ‘రాధేశ్యామ్’తో కలిపితే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. అన్నీ ఒక దానికి మరోటి సంబంధం లేని చిత్రాలే. పాత్రలు కూడా అంటే వైవిధ్యంతో కూడినవి.

లవర్ బాయ్

జ‌న‌వ‌రి 14, 2022న విడుదల కానుంది ‘రాధేశ్యామ్’. ఇందులో ప్రభాస్ ల‌వ‌ర్ బాయ్ గా దర్శనమిస్తారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇది పక్కా ప్రేమకథాచిత్రం. విక్రమాదిత్య అనే ప్రేమికుడి పాత్ర పోషిస్తున్నారు.

అడవిరాముడు టు శ్రీరాముడు

ప్రభాస్ గతంలో ‘అడవి రాముడు’ అనిపించుకున్న విషయం తెలుసు. ఇప్పుడు శ్రీరాముడు పాత్రలో దర్శనమిస్తారు. “ఆధిపురుష్” చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్నారు. రామాయణం ఆధారంగా రూపొందుతోన్న మూవీ ఇది. ఆగస్టు 11, 2022న విడుదల కానుంది ‘ఆదిపురుష్’.

నాయకుడు

ప్రభాస్ నటిస్తున్న మరో మూవీ.. స‌లార్. ఇది ఎప్పుడు విడుదలవుతుందో ఇప్పుడే చెప్పలేం. ఇందులో ‘రెబెల్’గా కనిపిస్తారు. ఒక ముఠాని ఎదుర్కొనే నాయకుడి పాత్ర. “KGF” ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ తీస్తున్న మూవీ ఇది.

రోదసీ ప్రయాణికుడు!

‘మ‌హాన‌టి’ ఫేమ్ ద‌ర్శ‌కుడు నాగ అశ్విన్, ప్ర‌భాస్ కాంబినేషన్ లో రూపొందనున్న మూవీ… ప్రాజెక్ట్ కే. ఇదొక సైన్స్ ఫిక్ష‌న్ స్టోరీ. ఇది స్పేస్ షిప్ నేపథ్యంగా సాగుతుంది.

పొలీసు పాత్రలో

ప్రభాస్ హీరోగా ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా ఇటీవలే ‘స్పిరిట్’ అనే మూవీ ప్రకటించారు. 2023లో మొదలవుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ పోలీసు అధికారిగా కనిపిస్తారట.

 

More

Related Stories