పెళ్లి తర్వాత మొదటి ప్లాప్!

Pranitha Subash


హీరోయిన్ ప్రణీత ఇటీవలే పెళ్లి చేసుకొంది. పెళ్లికి ముందే ఆమె బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆమె నటించిన తొలి హిందీ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా జులై 24న హాట్ స్టార్ లో డైరెక్ట్ గా విడుదలైంది ఆ హిందీ చిత్రం. ఆ మూవీ పేరు…. హంగామా 2.

‘హంగామా 2’ ఘోరంగా ఉందని క్రిటిక్స్ తేల్చారు. ఈ సినిమాకి 1/5, 0.5/ రేటింగ్స్ వచ్చాయి. అంటే ఎంత బోర్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రణీత పెళ్లి తర్వాత విడుదలైన మొదటి మూవీ ఇది. మొత్తమ్మీద, ఆమె బాలీవుడ్ కెరీర్ పై ఇక ఆశలు వదులుకోవచ్చు.

అన్నట్లు, ‘హంగామా 2’ సినిమాకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. 14 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత శిల్పాశెట్టి నటించిన మూవీ ఇది. ఆమె భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత ఈ సినిమా విడుదలైంది.

ఇక ప్రణీత విషయానికి వస్తే, ఆమెకి తెలుగులో కూడా ఇప్పుడు పెద్దగా ఆఫర్లు రావడం లేదు.

Advertisement
 

More

Related Stories