కేరళ గూటికి కన్నప్ప క్యూటి

కన్నప్ప సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ప్రీతి ముకుందన్. మంచు విష్ణు సరసన నటించింది. “భక్త కన్నప్ప” భక్తి చిత్రం అయినా ఆమెతో గ్లామర్ షో చేయించారు. అంత కష్టపడ్డా ఈ అమ్మడికి లాభం కలగలేదు.
“కన్నప్ప” ప్రమోషన్లలో ప్రీతిని ఎక్కువగా ఇన్వాల్వ్ చెయ్యలేదు. ఇక సినిమాని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేసినా పెద్దగా ఆడలేదు. దాంతో ఈ భామకి తెలుగులో ఆఫర్లు కొత్తగా రావడం లేదు. వరుసగా ఛాన్స్ లు క్యూ కడుతాయని ఆశించింది ఈ భామ. కానీ అలా జరగలేదు.
దాంతో, ప్రీతి ఇప్పుడు మలయాళంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
ఆమె నటించిన “మైనే ప్యార్ కియా” అనే మలయాళ చిత్రం గత నెలలో విడుదలైంది. అది ఆమెకి మొదటి మలయాళ చిత్రం. ఇక మరో రెండు నెలల్లో ఆమె నటించిన రెండో మలయాళ చిత్రం విడుదల కానుంది. “సర్వం మాయ” అనే సినిమాలో ఆమె నివీన్ పౌలి సరసన నటించిన. తెలుగులో దక్కని పాపులారిటీ అక్కడ దక్కేలా ఉంది.