విలన్ గా నటించాలని ఉందట

గతంలో తనని ‘కర్ర ఆంటీ’, ‘ఫ్యాట్ పిగ్’ అని కొందరు ఆకతాయిలు ఆన్ లైన్లో వేధించారనే విషయాన్ని బయటపెట్టి కలకలం రేపింది ప్రియమణి. జాతీయ ఉత్తమ నటి అవార్డ్ పొందిన ప్రియమణికి అలాంటి ట్రోలింగ్ జరిగిందని తెలిసి అందరూ షాక్ తిన్నారు. దాంతో, మీడియా ఆమెని వరుసగా ఇంటర్వ్యూలు చేస్తోంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన డ్రీం రోల్ ఏంటనేది తెలిపింది. ఒక పాత్ర కోసం నిరీక్షణ తప్పడం లేదని చెప్తోంది.
రమ్యకృష్ణ చేసిన ‘నీలాంబరి’ తరహా పాత్ర చెయ్యాలనేది ప్రియమణి కల. “నా బాడీ లాంగ్వేజ్, నా డైలాగ్ డెలివరీ పొగరుబోతు పాత్రలకు సరిగ్గా సరిపోతుంది. అందుకే, అలాంటి పాత్ర కోసం చూస్తున్నాను. అలాగే, పూర్తి స్థాయి విలన్ గా నటించాలనేది కోరిక,” అని ప్రియమణి వెల్లడించింది.
పెళ్లి చేసుకొని బెంగళూరులో సెటిల్ అయింది ప్రియమణి.
Also Check: Priyamani in a short gown
తెలుగులో ఆమె ఇటీవలే రెండు సినిమాల్లో నటించింది. ఒకటి రానా నటించిన ‘విరాటపర్వం’, మరోటి వెంకటేష్ మూవీ ‘నారప్ప’. వెంకటేష్ సరసన నటించాలనే కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది అని చెప్తోంది. ఈ సినిమాలో ఆమె వెంకీ భార్యగా నటించింది.