కలకలం రేపిన రాహుల్ ట్వీట్

NET Trailer

రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందిన డిజిటల్ మూవీ… నెట్ (NET). జీ5లో విడుదల కానుంది. అవికా గోర్ హీరోయిన్ ఇందులో. ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకొంది. దీని ప్రొమోషన్ కోసం రాహుల్ రామకృష్ణ పోస్ట్ చేసిన ట్వీట్లు కలకలం రేపుతున్నాయి. బూతులతో కూడిన ఆ ట్వీట్లు అందర్నీ ఆశ్చర్యపరిచాయి.

అమ్మాయిలను రహస్యంగా చూసే పిచ్చి ఉన్న వాడిగా కనిపిస్తాడు రాహుల్ రామకృష్ణ ఇందులో. బూతులు కూడా యథేచ్ఛగా వాడుతాడు. ఇప్పుడు ఓటిటి సినిమాల్లో బూతులు వాడని పాత్రలు తక్కువ. ఆ పాత్ర స్టయిల్లోనే తన సినిమాని బూతులతో ప్రొమోషన్ చేస్తున్నాడు.

ఐతే, అతను వాడిన లాంగ్వేజ్ అంతా ఆ మూవీలో ఉన్నదే.

ఐతే, ట్విట్టర్ ఫాలోవర్స్ మాత్రం ఆ పోస్టులని చూసి ఖంగుతిన్నారు. ఒక సెలబ్రిటీ నుంచి ఇలాంటి భాష వస్తుందని ఎవరూ ఊహించారు కదా. అందుకే, కామెంట్స్ కొంచెం వైల్డ్ గా ఉన్నాయి. ఐతే, ఇప్పుడు బోల్డ్ గా ప్రోమోట్ చేస్తేనే జనాలను ఆకట్టుకుంటామని ఆ మూవీ టీం భావించి ఉంటుంది.

Advertisement
 

More

Related Stories