అవును రజినీకాంత్ కీ సిస్టరే!


రజినీకాంత్ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తోంది అని గతేడాది న్యూస్ వచ్చినప్పుడు అందరూ పెదవి విరిచారు. రజినీకాంత్ కూతుళ్ళ కన్నా చాలా చిన్నదైన కీర్తి ఆయనకి జోడి ఏంటని అనుకున్నారు. కానీ ఆమె చెలిగా కాదు చెల్లెలుగా నటిస్తోందన్న ఆ తర్వాత తెలిసింది.

తాజాగా విడుదలైన ‘పెద్దన్న’ (తమిళంలో ‘అన్నత్తే’ పేరుతో విడుదల కానుంది) ట్రైలర్ తో అది రూఢి అయింది. ట్రైలర్ వచ్చింది. ఒక ఊరి పెద్దగా ఉన్న ఓ వ్యక్తి తన చెల్లెలు కోసం ఎంత దూరమైన వెళ్తాడు, ఎంతకైనా తెగిస్తాడు అనే కథతో రూపొందింది ఈ చిత్రం. ఆ ఊరి పెద్ద, ఆ చెల్లెలికి పెద్దన్న రజినీకాంత్. కీర్తి సురేష్ ఆయన ముద్దుల చెల్లెలు.

మహేష్ బాబు నటించిన ‘అర్జున్’ సినిమా కథ ఛాయలు కొంచెం కనిపిస్తున్నాయి. రజినీకాంత్ లుక్కు మాత్రం అదిరిపోయింది.

Peddanna - Official Trailer | Rajinikanth | Sun Pictures | Siva| Nayanthara| Keerthy Suresh| D.Imman

కీర్తి సురేష్ సూపర్ స్టార్ కి చెల్లెలుగా నటించినట్లే. మన తెలుగులో కూడా మెగాస్టార్ కి సిస్టర్ గానూ కనిపించనుంది. ‘భోళా శంకర్’ చిత్రంలో రంజీవి, కీర్తి సురేష్ అన్నాచెల్లెలు పాత్రల్లో దర్శనమిస్తారు. ఇలా వరుసగా ఇద్దరి సీనియర్ హీరోలకి సిస్టర్ గా నటిస్తోంది కీర్తి సురేష్.

అన్నట్లు కీర్తి సురేష్ తల్లి మేనక అటు చిరంజీవితోనూ (“పున్నమి నాగు”), ఇటు రజినీకాంత్ తోనూ హీరోయిన్ గా నటించారు.

Advertisement
 

More

Related Stories